చైతూ మొదలు పెట్టబోతున్నాడు

Tuesday,July 07,2020 - 01:40 by Z_CLU

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరి’ చేస్తున్నాడు. దాదాపు ఫినిషింగ్ స్టేజికి చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ప్రభుత్వం నుండి పర్మిషన్ రావడంతో మళ్ళీ షూటింగ్ మొదలు కాబోతుంది.

వచ్చే నెల నుంచి మిగిలిన బ్యాలెన్స్ షూట్ ను పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఆ షెడ్యుల్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్లాన్ జరుగుతుంది. రామోజీ ఫిలిం లో ఓ సెట్ వేసి అక్కడ సన్నివేశాలు తీయబోతున్నారు.

మరి షూటింగ్ పూర్తి చేసి దసరాకి సినిమాను రిలీజ్ చేస్తారా లేదా వచ్చే ఏడాది వరకు వెయిట్ చేస్తారా చూడాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై నారాయణ దాస్, పుష్కర రామ్ , రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ సంగీతం అందిస్తున్నాడు.