నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్

Monday,June 05,2017 - 10:46 by Z_CLU

సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రారండోయ్ వేడుక చూద్దాం. నాగచైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సమ్మర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ కూల్ సమ్మర్ ఎంటర్ టైనర్ కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది.

నాగచైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హిట్ గా నిలిచింది రారండోయ్ వేడుక చూద్దాం. విడుదలైన 9 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 తర్వాత స్ట్రాంగ్ గా రన్ అవుతున్న సినిమా ఇదే.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థియేటర్లలోకి వచ్చి చాలా రోజులైంది. సంక్రాంతికొచ్చిన శతమానంభవతి సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదు. ఈ సమ్మర్ లో ఆ లోటును భర్తీ చేసింది రారండోయ్ మూవీ. దీనికి తోడు చైతూ-రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, దేవిశ్రీ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సూపర్ హిట్ వెంచర్ గా మారింది.