నాగ చైతన్య అప్ కమింగ్ మూవీస్

Sunday,July 30,2017 - 10:01 by Z_CLU

మొన్నటి వరకూ ఏడాదికో సినిమా చేసే చైతూ ప్రెజెంట్ ఇయర్ కి ఓ రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటూ స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం కృష్ణ మారిముత్తు డైరెక్షన్లో ‘యుద్ధం శరణం’ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్న చైతూ ఈ సినిమాను ఇప్పటికే ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.


‘యుద్ధం శరణం’ సినిమా రిలీజ్ టైంలోనే మరో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు చైతు. ప్రేమమ్ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందించిన చందూ మొండేటి నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకున్న అక్కినేని యంగ్ హీరో ఈ సినిమాను కూడా వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఫామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని, ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం.


చందూ మొండేటితో తెరకెక్కే సినిమా ఓ కొలిక్కి రాగానే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట చైతు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు కథ ఫైనల్ అయిందని, చైతుతో పాటు నాగ్ కి కూడా కథ బాగా నచ్చిందని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్ వినిపిస్తుంది.