జీ స్పెషల్: చైతూ చేతిలో 4 సినిమాలు

Wednesday,May 06,2020 - 01:43 by Z_CLU

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సాఫ్ట్ ‘లవ్ స్టోరి’ చేస్తున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తన తదుపరి సినిమాలకు సంబంధించి నలుగురు దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అవును… ప్రస్తుతం చైతు లిస్టులో నలుగురు దర్శకులున్నారు. ‘లవ్ స్టోరి’ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న చైతు ఆ వెంటనే విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని టాక్.

అలాగే నందిని రెడ్డి చెప్పిన ఓ కథకు కూడా ఒకే చెప్పాడట చైతు. ఇక పరశురాం డైరెక్షన్ లో ‘నాగేశ్వరావు’ సినిమా ఎలాగూ లిస్ట్ లో ఉంది. వీటిలో ఏది వీలుంటే అది ముందు సెట్స్ పైకి వస్తుంది.

సో… ఇలా నలుగురు దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసిన చైతూ.. ఇంకా కొన్ని కథలు కూడా వింటున్నాడు. ఇలా తనకి నచ్చిన కథలతో ప్రేక్షకులను మెప్పించి వరుస విజయాలు అందుకోవాలని చూస్తున్నాడు చైతన్య.