సవ్యసాచికి బ్రేక్ చెప్పనున్న నాగచైతన్య

Thursday,May 10,2018 - 10:04 by Z_CLU

నాగచైతన్య ‘సవ్యసాచి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం U.S. లో సినిమాలోని కీలక  సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనున్నారు. అయితే ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా ‘శైలజా రెడ్డి అల్లుడు’ నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతాడు నాగచైతన్య.

‘సవ్యసాచి’ సెట్స్ పై ఉండగానే మారుతి డైరెక్షన్ లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన నాగ చైతన్య, ప్రస్తుతం సవ్యసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ షెడ్యూల్ తరవాత  మే 18 నుండి ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో బిజీ అవుతాడు నాగచైతన్య.

 

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నాగచైతన్య సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగ చైతన్య కి అత్తగా రమ్యకృష్ణ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ షెడ్యూల్ తరవాత ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.