హాట్ గాసిప్: బాబి దర్శకత్వంలో చైతూ

Thursday,March 15,2018 - 11:28 by Z_CLU

ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే. కానీ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డైరక్టర్ బాబి, హీరో నాగచైతన్య మధ్య ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రాజెక్టు ఓకే అయితే రామ్ తళ్లూరికి చెందిన ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా ఉంటుంది.

ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. సైమల్టేనియస్ గా మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా.. 4 రోజుల కిందట శివనిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు ట్వీట్ చేశాడు.

ఇన్ని సినిమాల మధ్య బాబి స్క్రిప్ట్ కు కూడా ఓకే చెబితే చెప్పొచ్చు కానీ అది సెట్స్ పైకి రావడానికి మాత్రం చాలా టైం పడుతుందనేది గ్యారెంటీ. తన సినిమాలకు సంబంధించి ఎలాంటి వార్తలు నమ్మొద్దని, తనే స్వయంగా ప్రకటిస్తానని నాగచైతన్య ఇప్పటికే చెప్పాడు కాబట్టి, ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ కోసం అతడి ట్వీట్లు ఫాలో అవ్వాల్సిందే. జై లవకుశ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు బాబి.