ThankYou - సెట్స్ పైకొచ్చిన నాగచైతన్య

Monday,December 21,2020 - 01:43 by Z_CLU

ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయడం నాగచైతన్య స్టయిల్. రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాను కంప్లీట్ చేసిన ఈ హీరో, ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

నాగచైతన్య హీరోగా ఇవాళ్టి నుంచి ThankYou మూవీ సెట్స్ పైకొచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు చైతూపై ఫస్ట్ షాట్ తీశారు. SVC బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

ThankYou_movie_shoot_begins_naga_Chaitanya_Vikram_kumar

సెట్స్ పైకొచ్చిన మొదటి రోజే వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. విక్రమ్ కుమార్ పై ఫస్ట్ వర్కింగ్ స్టిల్ రిలీజైంది. NagaChaitanya-VikramKumar కాంబినేషన్‌లో వచ్చిన ‘మనం’ ఓ క్లాసిక్‌ మూవీ. అలాంటి కాంబినేషన్‌లో ఇప్పుడు ThankYou రాబోతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ 3 ట్యూన్స్ కంపోజ్ చేశాడు కూడా.

Also Check – నాగచైతన్య-సమంత స్టయిలిష్ పిక్స్