ఇనిస్టెంట్ హిట్: ‘శైలజారెడ్డి అల్లుడు’ సెకండ్ సాంగ్

Friday,August 17,2018 - 06:34 by Z_CLU

‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా సెకండ్ సింగిల్ రిలీజయింది. సిచ్యువేషనల్ గా ఉండబోయే ఈ సాంగ్ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తుంది. దానికి తోడు సినిమాలో స్పెషల్ గా నిలవనున్న ఈ సాంగ్ ని ఫోక్ సింగర్ మంగ్లీ చేత పాడించారు ఫిలిమ్ మేకర్స్. మాస్ బీట్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ కి మంగ్లీ వాయిస్ ఆడ్ అవ్వడంతో ఈ సాంగ్ వెరీ వెరీ స్పెషల్ గా మారింది.

కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ లిరిక్స్ సినిమాలోని 3 మెయిన్ క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి. దానికి తోడు అటు అత్త, ఇటు వైఫ్ మధ్య నలిగిపోయే నాగచైతన్య రోల్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశారు ఫిలిమ్ మేకర్స్ ఈ సినిమాలో. గోపీసుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఆగష్టు 31 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. మారుతి ఈ సినిమాకి డైరెక్టర్.