నాగచైతన్య స్కీమ్ ఏంటో ప్రస్తుతానికి సస్పెన్స్...

Friday,August 31,2018 - 01:01 by Z_CLU

నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ థియేట్రికల్  ట్రైలర్ రిలీజయింది. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కొనసాగింపులా ఉన్న 1:48 సెకన్ల ఈ ట్రైలర్ లో సినిమాలో స్టోరీ మరికొంత  రివీల్ చేశారు ఫిలిమ్ మేకర్స్.

‘నా పేరు చైతన్య… ముద్దుగా అందరూ చైతు అని పిలుస్తుంటారు.’ అంటూ బిగిన్ అయ్యే ఈ ట్రైలర్ మ్యాగ్జిమం నాగ చైతన్య చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తుంది. సినిమాలో చైతు ఫాదర్ వేసిన స్కీమ్, నాగచైతన్య ఎగ్జాక్ట్ గా రీచ్ అవ్వాల్సిన టార్గెట్ లాంటివి ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా, అటు అత్త, ఇటు గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో సూపర్బ్ గా ఉన్నాడు నాగచైతన్య.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 13 న గ్రాండ్ గా రిలీజవుతుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. గోపీసుందర్  మ్యూజిక్ కంపోజర్.