రేపే శైలజారెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రయిలర్

Thursday,August 30,2018 - 06:38 by Z_CLU

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా ట్రయిలర్ రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

లెక్కప్రకారం, ఈ పాటికే శైలజారెడ్డి అల్లుడు ట్రయిలర్ మార్కెట్లోకి రావాల్సింది. కానీ హరికృష్ణ హఠాన్మరణంతో ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేశారు. ఇక సినిమాను సెప్టెంబర్ 13న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టైటిల్ డిజైన్, ఫస్ట్ లుక్, సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.