శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్ సూపర్ హిట్

Thursday,August 02,2018 - 04:01 by Z_CLU

ఆగష్టు 31 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది శైలజా రెడ్డి అల్లుడు సినిమా. అయితే ఈ లోపు మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నిన్న రిలీజయింది. ఆల్రెడీ మోస్ట్ అవేటింగ్ మూవీ లిస్టులో ఉన్న ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ పై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. 24 గంటలు కూడా రిలీజ్ కాకముందే ఈ టీజర్ 8 లక్షల వ్యూస్ క్రాస్ చేసింది.

అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ ఈగో ఉన్న అమ్మాయిలా  కనిపించనుంది. ఇక నాగ చైతన్య కి అత్తలా కనిపించనున్న రమ్యకృష్ణ రోల్ సినిమాలో ఇంకెలా ఉండబోతుందో నన్న క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది ఈ సినిమా టీజర్. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య నలిగే క్యారెక్టర్ లో నాగచైతన్య కనిపించనున్నాడు.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్ ని త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.