గ్రాండ్ గా రిలీజైన ‘శైలజారెడ్డి అల్లుడు’

Thursday,September 13,2018 - 12:03 by Z_CLU

ఫస్ట్ షో తోనే పాజిటివ్ దక్కించుకుంటుంది నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు. మారుతి మార్క్ తో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఈ వినాయక చవితికి ఫుల్ మీల్స్ అనిపించుకుంటుంది. ఏ మాత్రం బోర్ కొట్టని సీక్వెన్సెస్ తో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి బెస్ట్ మూవీగా  డిక్లేర్ అయింది.

సినిమా ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే నాగ చైతన్య సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఉండే ఫైట్ సీన్ లో అదుర్స్ అనిపించుకున్నాడు చైతు. అటు కామెడీ, ఇమోషన్, యాక్షన్.. ఇలా ఏ ఎలిమెంట్ తగ్గకుండా పక్కా ప్లానింగ్ తో తెరకెక్కి పండక్కి వచ్చిన ఈ ‘శైలజా రెడ్డి అల్లుడు’ టోటల్ గా అందరికీ నచ్చేస్తున్నాడు.

బాహుబలి లో శివగామి తర్వాత రమ్యకృష్ణ ని మళ్ళీ అదే రేంజ్ ఇంటెన్సివ్ రోల్ లో ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. టఫ్ఫెస్ట్ విమెన్ గా రమ్యకృష్ణ పర్ఫామెన్స్ మాస్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. అనూ ఇమాన్యువెల్ గ్లామర్, సాంగ్స్ పిక్చరైజేషన్ ఇలా ప్రతీది పర్ఫెక్ట్ గా సింక్ అయిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు.

సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో ఎలివేట్ అవుతున్నాయి. గోపీ సుందర్ మ్యూజిక్ కి స్క్రీన్ పై మరింత గ్రేస్ ఆడ్ అయింది.