తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - నాగచైతన్య

Thursday,June 15,2017 - 10:27 by Z_CLU

యువసామ్రాట్ నాగచైతన్య టాలీవుడ్ ఆడియన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. తను నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు చైతూ. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కోసం అరకు వెళ్లిన నాగచైతన్య.. అక్కడ్నుంచే ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సమ్మర్ విజయాల్లో తనకు కూడాా భాగం కల్పించినందుకు అభిమానులు, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరోసారి హిట్ కొడతామంటూ ఆడియో ఫంక్షన్ లో చెప్పిన నిర్మాత నాగార్జున… చెప్పింది చేసి చూపించారు. దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ తో ఈ సినిమా వేసవి సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

కల్యాణ్ కృష్ణకు దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఇక రకుల్ విషయానికొస్తే తన కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ పోషించిందామె. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. జగపతిబాబు, సంపత్ సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రారండోయ్ సినిమాను సూపర్ హిట్ చేశాయి.