నాగచైతన్య సమంతాల సినిమా సెట్స్ పైకి...

Thursday,October 11,2018 - 07:13 by Z_CLU

టాలీవుడ్ లో మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వచ్చేసింది. నాగ చైతన్య, సమంతా జోడీగా తెరకెక్కాల్సిన సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. నిన్నటి నుండే రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ప్రస్తుతం  సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు.

నిజానికి చై, స్యామ్ కాంబినేషన్ లో ఇది 4 వ సినిమా. కానీ పెళ్ళి తర్వాత తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ స్థాయిలో అటెన్షన్ ఫిక్స్ అయి ఉంది. నిన్నుకోరి సినిమాతో సూపర్ హిట్టందుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకి డైరెక్టర్.

సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పోసాని మురళి కృష్ణ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.