అక్టోబర్ 6న నాగచైతన్య, సమంత పెళ్ళి

Thursday,June 08,2017 - 04:36 by Z_CLU

సమంతతో తన పెళ్లి అక్టోబర్ లో ఉంటుందని నాగచైతన్య ఇప్పటికే ప్రకటించాడు. అయితే డేట్ విషయంలో మాత్రం పెద్ద సస్పెన్స్ కార్డు వేశాడు. ఈ రోజు ఆ సస్పెన్స్ ని కూడా బ్రేక్ చేస్తూ అక్టోబర్ 6 న సమంతను పెళ్ళాడబోతున్నానని ప్రకటించాడు చైతూ.

ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా మోస్ట్ రొమాంటిక్ పెయిర్ అనిపించుకున్నారు నాగచైతన్య, సమంత. ‘ఏ మాయ చేశావే’తో కలిసిన ఈ జోడీ, ఆటోనగర్ సూర్య మూవీతో మరింత దగ్గరైంది. ప్రేమమ్ సినిమా టైమ్ లో వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. అలా తన ప్రేమను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన చైతూ-సమంత.. మరో 4 నెలల్లో ఒక్కటి కాబోతున్నారు.

పెళ్లికి 3 నెలలు గ్యాప్ తీసుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. సో.. సెప్టెంబర్ నుంచి ఇక వీళ్లిద్దరూ సెట్స్ పై కనిపించరు. నవంబర్ నుంచి తిరిగి తమ సినిమాల్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం సమంత చేతిలో రాజుగారి గది-2, మహానటి, రామ్ చరణ్ సినిమాలున్నాయి. అటు నాగచైతన్య, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.