నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో మరో సినిమా

Thursday,March 08,2018 - 11:06 by Z_CLU

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సవ్యసాచి సినిమాను కూడా దాదాపు ఓ కొలిక్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగచైతన్య.

నానితో తీసిన నిన్ను కోరి సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చాడు శివ నిర్వాణ. హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీగా నిన్ను కోరి సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో మరో లవ్ స్టోరీకి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టులో చైతూ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని అటు నాగచైతన్య, ఇటు సమంత జాయింట్ గా ప్రకటించారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం వీళ్లు నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నారు. నాగచైతన్య సినిమా నిర్మాతలుగా వీళ్లకు రెండోది. త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకొస్తాయి.