టీజర్ తో రెడీ అవుతున్న అక్కినేని హీరో

Monday,July 03,2017 - 05:54 by Z_CLU

అక్కినేని ఫాన్స్ లో మరింత జోష్ నింపడానికి టీజర్ తో రెడీ అవుతున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య. ప్రెజెంట్ చైతు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యుద్ధం శరణం’. కృష్ణ మారిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో లేటెస్ట్ గా ఫాన్స్ తో పాటు అందరినీ మెస్మరైజ్ చేసిన చైతు ఇదే నెలలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో రెడీ అవుతున్నాడు..

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ వైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్ జులై 15 న టీజర్ ను రిలీజ్ చేసి జులై నెలాఖరున ఆడియో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. వారాహి చాలనచిత్రం బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత.