రూమర్లపై రియాక్ట్ అయిన నాగచైతన్య

Friday,February 23,2018 - 01:26 by Z_CLU

నా నెక్ట్స్ సినిమాపై వచ్చిన వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం సవ్యసాచి, మారుతి దర్శకత్వంలో మరో సినిమా మాత్రమే చేస్తున్నాను. ఆ రెండూ బాగా వస్తున్నాయి. కొన్ని మంచి కథలు వింటున్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. అప్పటివరకు నా నెక్ట్స్ ప్రాజెక్టుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.”

నాగచైతన్య స్వయంగా ఇలా ప్రకటించాడు. ఉన్నట్టుంచి ఇంత సెడన్ గా చైతూ ట్విట్టర్ లో ఈ ప్రకటన చేయడానికి ఓ కారణం ఉంది. సౌజన్య అనే లేడీ డైరక్టర్ చైతూకు ఓ కథ చెప్పారని, ఆమె దర్శకత్వంలోనే చైతూ నెక్ట్స్ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ సినిమా ఉంటుందని కూడా గాసిప్స్ వచ్చాయి. వీటన్నింటిపై రియాక్ట్ అవుతూ పై విధంగా ట్వీట్ చేశాడు నాగచైతన్య.

ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న 2 సినిమాల్లో సవ్యసాచి దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అటు మారుతి దర్శకత్వంలో చేస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే నెక్ట్స్ సినిమాపై ప్రకటన చేయబోతున్నాడు చైతూ.