నిర్మాతలుగా రానా, నాగచైతన్య

Tuesday,December 13,2016 - 11:28 by Z_CLU

వీళ్లిద్దరూ టాలీవుడ్ నోటెడ్ హీరోస్. ఇద్దరూ చుట్టాళ్లు కూడాా. హీరోలుగా కంటిన్యూ అవుతున్న నాగచైతన్య, రానా ఇప్పుడు మరో ఫీల్డ్ లో తమ లక్ చెక్ చేసుకోబోతున్నారు. అవును… నిర్మాతలుగా మారి కలిసి సినిమా చేయాలని రానా-చైతూ ఫిక్స్ అయ్యారు. సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి.. ఆ బ్యానర్ పై ఓ ప్రయోగాత్మక చిత్రం చేయాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారట.

rana-naga-chaitanya

నిజానికి కొత్తగా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఈ హీరోలిద్దరికీ లేదు. రానాకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది. అటు చైతూకు కూడా అన్నపూర్ణ స్టుడియోస్ ఉంది. ఈ రెండు బ్యానర్స్ పై తాము చేయాల్సిన సినిమాలు చేసుకోవచ్చు. కానీ నిర్మాతలుగా కూడా రాణించాలనే ఉద్దేశంతో… సొంతంగా, కొత్తగా ఓ ప్రొడక్షన్ వెంచర్ స్టార్ట్ చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ హీరోల కొత్త నిర్మాణ సంస్థకు చెందిన డీటెయిల్స్ తెలుస్తాయి.