చైతు స్పీడ్ పెంచేశాడు...

Sunday,May 07,2017 - 12:00 by Z_CLU

ప్రెజెంట్ అక్కినేని నాగ చైతన్య స్పీడ్ పెంచేశాడు.. మొన్నటి వరకూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ‘రారండోయ్’ వేడుక చూద్దాం’ సినిమాతో పాటు కృష్ణ మరిముత్తు దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తూ బిజీ గా గడిపిన చైతు ప్రెజెంట్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు ప్యాక్ అప్ చెప్పేశాడు…

లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ కూడా ఫినిష్ చేసిన చైతు ప్రెజెంట్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోయే సినిమాను సెట్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాడట.. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి సెట్స్ పెట్టబోతున్నాడని సమాచారం.. ఈ రెండు సినిమాలతో పాటు చైతు మరికొన్ని కథలు కూడా వింటూ ఏడాది కి రెండు, మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నాడట చైతు…