ఆ రీమేక్ ను పక్కనపెట్టిన చైతూ...

Saturday,November 19,2016 - 05:00 by Z_CLU

నాగచైతన్య చుట్టూ ఎప్పుడు ఏదో ఒక రీమేక్ తిరుగుతుంటూనే ఉంటుంది. ఆ సినిమాను రీమేక్ చేస్తాడంటూ ఒకసారి.. ఈ సినిమా రీమేక్ అంటూ ఒకసారి వార్తలు వస్తూనే ఉంటాయి. అలా చక్కర్లు కొట్టిన రీమేక్ సినిమాల్లో ఒకదానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. అదే మెట్రో సినిమా. సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో నాగచైతన్య రీమేక్ చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. దాదాపు 3నెలల పాటు ఈ వార్తలు అక్కినేని కాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొట్టాయి.

     కానీ మెట్రో రీమేక్ కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విషయం తాజాగా స్పష్టమైంది. ఈ సినిమా ఎలాగూ రీమేక్ కు నోచుకోలేదు కాబట్టి.. నేరుగానే విడుదల చేద్దామని పంపిణీదారుడు సురేష్ కొండేటి ఫిక్స్ అయ్యాడు. సినిమాకు డబ్బింగ్ చెప్పించాడు. తాజాగా టీజర్లు, పోస్టర్లు కూడా విడుదల చేశాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ ను పెట్టి ఓ చిన్నపాటి ప్రచారం కూడా మొదలుపెట్టాడు. సో.. మెట్రో సినిమా రీమేక్ ఇక లేనట్టే అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

  మలయాళంలో హిట్ అయిన యు-టర్న్, అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకున్న2-స్టేట్స్ సినిమాలు మాత్రం ఇంకా లైన్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల రీమేక్స్ లో చైతూ నటిస్తాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నాగచైతన్య మాత్రం కల్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు. ఇదైపోగానే ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాను ఫినిష్ చేస్తాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇస్తాడు. ఆ తర్వాత మాత్రమే ఈ రీమేక్స్ గురించి ఆలోచిస్తాడు.