నాని దర్శకుడితో నాగ చైతన్య ?

Sunday,February 25,2018 - 01:20 by Z_CLU

ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు నాగ చైతన్య. ఓ వైపు చందు మొండేటి డైరెక్షన్ లో ‘సవ్యసాచి’ సినిమా చేస్తూనే మరో వైపు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు చైతు. ఈ రెండు సినిమాలతో చైతు ‘నిన్ను కోరి’ ఫేం శివ నిర్వాన డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడి అవ్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని.. శివ చెప్పిన కథకి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉన్న చైతు త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేసే చాన్స్ ఉంది.