నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య?

Monday,March 02,2020 - 11:28 by Z_CLU

ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘లవ్ స్టోరి’ సినిమా చేస్తున్న నాగ చైతన్య నెక్స్ట్ పరశురాం బుజ్జి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈమధ్య అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే లేటెస్ట్ గా మరో సినిమాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడట చైతూ. నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు అక్కినేని హీరో.

ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ , ప్రియాంక దత్ నిర్మించబోతున్నారని సమాచారం. రీసెంట్ గా చైతూకి స్క్రిప్ట్ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్న నందిని రెడ్డి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరి చైతూ నెక్స్ట్ సినిమా పరశురాంతో ఉండబోతుందా లేదా నందిని రెడ్డి సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది. చైతూ మాత్రం ంతన కెరీర్ లో గ్యాప్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఈ రెండు సినిమాల్లో ఏది బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ అయితే, ముందుగా ఆ సినిమాకే కాల్షీట్లు ఇస్తాడు.