నాగచైతన్య కొత్త సినిమా అప్ డేట్స్ 

Wednesday,December 14,2016 - 07:00 by Z_CLU

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగచైతన్య సినిమా చేస్తున్నాడు. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. లేటెస్ట్ గా వైజాగ్ లో 10 రోజుల షూటింగ్ తో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసిన యూనిట్… నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది.

naga-chaitanya-rakul

వైజాగ్ లో జరిగిన షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు… నాగచైతన్య రకుల్ పై కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించి గ్రాండ్ హిట్ అందుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ… ఈ సినిమాను కూడా ఆ స్టైల్ లోనే ‘నిన్నేపెళ్లాడతా’ ఫ్లేవర్ తో లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడట.