నాగచైతన్య, పూజా హెగ్డే కాంబోలో మరో మూవీ?

Wednesday,August 02,2017 - 12:01 by Z_CLU

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సినిమాల విషయంలో చైతూ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం చేస్తున్న యుద్ధం శరణం సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన చైతూ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్ట్స్ సినిమా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

ఇంతకుముందు చైతూ-చందు కాంబోలో ప్రేమమ్ వచ్చింది. ఈసారి మరో డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతోంది ఈ హిట్ జోడీ. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారు. గతంలో చైతూ-పూజా కాంబినేషన్ లో ఒక లైలా కోసం సినిమా వచ్చింది.

అల్లు అర్జున్ DJ సక్సెస్ తో  స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయిన పూజా హెగ్డే కి టాలీవుడ్ ఒక్కసారిగా డిమాండ్ క్రియేట్ అయింది.