చైతూ సినిమాకు రెండు ఫస్ట్ లుక్స్

Tuesday,March 28,2017 - 01:04 by Z_CLU

ఉగాది కానుకగా నాగచైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్. చైతూ సినిమాకు సంబంధించి ఒకే రోజు ఏకంగా 2 ఫస్ట్ లుక్స్ రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి దర్శకుడు కల్యాణ్ కృష్ణ సెలక్ట్ చేసిన లుక్ కాదా.. ఇంకోటి నాగార్జున సెలక్ట్ చేసింది.

ఎప్పుడైనా ఫస్ట్ లుక్ ఒకటే రిలీజ్ అవుతుంది. కానీ చైతూ సినిమాకు మాత్రం 2 లుక్స్ రిలీజ్ అవ్వడానికి ఓ కారణం ఉంది. తను సెలక్ట్ చేసిన ఫస్ట్ లుక్ నుంచి  కల్యాణ్ కృష్ణ  వెనక్కితగ్గడం లేదు. అటు నాగ్ కు మరో లుక్ నచ్చింది. సో.. రెండూ రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు చైతన్య.

ఇదే విషయాన్ని చైతన్య ట్వీట్ చేయగా.. దానికి నాగ్ కూడా రీట్వీట్ చేశారు. రెండు లుక్స్ లో ఏది బాగుంటుందో రేపు పొద్దున్న తెలిసిపోతుందని నాగ్ రీట్వీట్ చేయడం విశేషం.