సైలెంట్ గా పనిపూర్తిచేసిన నాగచైతన్య

Saturday,March 11,2017 - 03:17 by Z_CLU

ప్రస్తుతం నాగచైతన్య చేతిలో 2 సినిమాలున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్న ఈ అక్కినేని యువసామ్రాట్… సేమ్ టైం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ సినిమా డీటెయిల్స్ అప్పుడప్పుడు తెలుస్తున్నాయి కానీ, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సంగతులు మాత్రం అస్సలు బయటకు రావడం లేదు. ఎట్టకేలకు ఆ సినిమా విశేషాలు కూడా బయటకొచ్చాయి.

కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట. ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. మూవీకి సంబంధించి 2-3 స్టిల్స్ నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. కల్యాణ్ కృష్ణ సినిమాను జులై నెలలో… కృష్ణ మరిముత్తు సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారట.