నాగచైతన్య, మారుతి సినిమా ప్రారంభం

Friday,January 19,2018 - 11:38 by Z_CLU

నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్ కోఠిలో ఉన్న ఓ కాలేజ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్ అనుకుంటున్నారు. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్.

సినిమాలో కీలకమైన శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. అత్త-అల్లుడు మధ్య ఉండే ఇగోలే ఈ సినిమా మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. వెన్నెల కిషోర్, కల్యాణి నటరాజన్, ఫృధ్వి, శరణ్య, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించనున్నారు.

ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే మారుతి దర్శకత్వంలో సినిమాకు పూర్తిగా కాల్షీట్లు కేటాయిస్తాడు.

ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావు
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్
సినిమాటోగ్రాఫర్ – నైజర్ షఫీ
మ్యూజిక్ – గోపీసుందర్
ప్రొడ్యూసర్ – సూర్యదేవర నాగవంశీ
సమర్పణ – పీడీవీ ప్రసాద్
రచయిత, దర్శకుడు – మారుతి