నాగచైతన్య ఇంటర్వ్యూ

Thursday,September 07,2017 - 06:40 by Z_CLU

నాగచైతన్య ‘యుద్ధం శరణం’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి. సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగచైతన్య ఈ సినిమా గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

 

టార్గెట్ యూతే…

యుద్ధం శరణం సినిమా టార్గెట్ యూతే.. అందుకే కాలేజెస్ కి వెళ్లి ప్రమోట్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి చాలా దగ్గరగా ఉంటుందీ సినిమా…

యుద్ధంలో యాక్షన్ ఉంటుంది.

ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది. కాకపోతే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంటలిజెన్స్ బేస్డ్ ఉంటాయి. అందుకే యాక్షన్ కన్నా, ఇంటెలిజెన్సి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాం.

గ్రేట్ ఫీలింగ్…

ఏ పనైనా ఫ్రెండ్ తో కలిసి చేయడం డిఫెరెంట్ ఫీలింగ్. ఈ సినిమా కోసం పని చేయడం కూడా అలాగే ఉంది. ఎవరో కొత్త డైరెక్టర్ తో పని చేసిన ఫీలింగ్ లేదు. ఇద్దరం కలిసి ఒకే పని చేస్తున్న ఫీలింగ్ కలిగింది.

ఫ్రెష్ నెస్ కి రీజన్ అదే…

ఈ సినిమాలో డైరెక్టర్ దగ్గర నుండి బిగిన్ చేస్తే 70% టెక్నీషియన్స్ కొత్తవాళ్ళే. ఈ సినిమాలో ఇంత ఫ్రెష్ కంటెంట్ ఉండటానికి కూడా అకారణం అదే…

లావణ్య చాలా కో ఆపరేటివ్

లావణ్య సినిమాలో కంటెంట్ ఉంటే కానీ సినిమా చేయదు. చాలా మంచి క్యారెక్టర్ చేసిందీ సినిమాలో. సెకండాఫ్ మొత్తం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తూనే ఉంటుంది. కష్టపడే నేచర్. ప్రమోషన్స్ కోసం 2 రోజులనుండి దాదాపు 6 కాలేజ్ లు తిరిగాం. చాలా సపోర్ట్ చేసింది.

నైట్ ఎఫెక్ట్ లో ఉంటుంది

ఈ సినిమాలో సెకండాఫ్ మొత్తం ఒక్కరోజులో జరిగే కథ. అందుకే రియలిస్టిక్ గా ఉండాలని మ్యాగ్జిమం రాత్రిపూటే షూటింగ్ చేశాం.

డ్రోన్ గాడ్జెట్ కూడా ఒక క్యారెక్టరే

ఈ సినిమాలో డ్రోన్ అనే ఒక గాడ్జెట్ వాడాం. ఆ గాడ్జెట్ కి దాపు ఒక క్యారెక్టర్ కి ఉన్నంత ఇంపాక్ట్ ఉంటుంది.  ఈ సినిమాలో నేను డ్రోన్ మేకర్ ని. సినిమా మొత్తం ఈ గాడ్జెట్ తరవాత ఆ రేంజ్ ఇంపాక్ట్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్, దాంతో పాటు రేవతి, రావు రమేష్ గారి క్యారెక్టర్స్. సినిమాలో హైలెటెడ్ క్యారెక్టర్స్.