నాగచైతన్య హీరోయిన్స్

Thursday,June 29,2017 - 10:05 by Z_CLU

ప్రెజెంట్ తన 14వ సినిమాతో సెట్స్ పై ఉన్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన ప్రెస్టీజియస్ 15 వ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ ప్రెస్టీజియస్ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వార్త వినిపించగానే ఈ సినిమాలో చైతుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరా.. అనే క్యూరియాసిటీ అక్కినేని ఫాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంటుంది. ఈ సినిమాలో చైతు సరసన నటించే హీరోయిన్ పై సోషల్ మీడియా లో రక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.. ఆ హీరోయిన్స్ ఎవరో.. ఓ లుక్కేద్దాం…

ఈ సినిమాలో చైతు హీరోయిన్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ తమన్నాదే… చైతు తో ఇప్పటికే ‘100% లవ్’, ‘తడాఖా’ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ముచ్చటగా మూడో సారి ఈ సినిమాలో చైతు సరసన నటిస్తే బాగుంటుంటుందని భావిస్తున్నారు అక్కినేని ఫాన్స్. పైగా వీరిద్దరూ నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ సాధించడం తో ఆ సెంటిమెంట్ ని కూడా జత చేస్తున్నారు.


కెరీర్ ఆరంభంలో చైతుతో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నందు క్యారెక్టర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి చైతు సరసన అలరించిన పూజ హెగ్డే పేరు కూడా ఈ లిస్ట్ లో చేర్చేస్తున్నారు ఫాన్స్. లేటెస్ట్ గా బన్నీ తో డీజే తో తన అందంతో మరింతగా ఆకట్టుకున్న పూజ ఇప్పుడు మరో సారి చైతుతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అక్కినేని ఫాన్స్.


ఈ సినిమాలో చైతు కి హీరోయిన్ గా నివేత థామస్ అయితే బాగుంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. జెంటిల్ మెన్ సినిమాలో నాని సరసన నటించి తన గ్లామరస్ యాక్టింగ్ అందరినీ ఎట్రాక్ట్ చేసి ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో అఫర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చైతు కి సూపర్ జోడీ అనడంలో ఎటువంటి సందేహం లేదు.


చైతు హీరోయిన్ లిస్ట్ లో వినిపిస్తున్న మరో పేరు అనుపమ పరమేశ్వరన్. ఇప్పటికే ప్రేమమ్ లో చైతుతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ…. లక్కీ హీరోయిన్ అనే టాగ్ లైన్ వేసుకోవడం పైగా ప్రేమమ్ తర్వాత చైతు-చందుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అనుపమ పేరు కూడా ఈ సినిమా లిస్ట్ లో గట్టిగానే వినిపిస్తుంది.

చైతు సరసన రెజీనా కూడా సూపర్ జోడీ అంటున్నారు ఫాన్స్. ఇప్పటికే ఆల్మోస్ట్ యంగ్ హీరోలందరితో సినిమాలు చేస్తూ తన పర్ఫార్మెన్స్ తో అదుర్స్ అనిపించుకుంటున్న ఈ అమ్మడు చైతుకి హీరోయిన్ గా నటిస్తే ఈ జోడి అదిరిపోతుందనే టాక్ వినిపిస్తుంది.


అక్కినేని నాగార్జునతో లేటెస్ట్ గా ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నటించిన ప్రగ్య పేరు కూడా చైతు హీరోయిన్ లిస్ట్ లో వినిపిస్తుంది. ఇప్పటికే నాగ్ తో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి తో ప్రెజెంట్ చైతు ఓ సినిమా చేస్తుండడం తో ప్రగ్య ని కూడా అక్కినేని హీరోయిన్ గా రిపీట్ చేస్తాడనే వార్త వినిపిస్తుంది.


ప్రెజెంట్ కోలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే టాలీవుడ్ లో నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మేఘ ఆకాష్ పేరు కూడా చైతు హీరోయిన్ లిస్ట్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ అమ్మడు చైతుకి అదిరిపోయే జోడీ అవుతుందని వీరిద్దరి పెయిర్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచి చైతు 15 మూవీ కి స్పెషల్ గా నిలుస్తుందనే టాక్ కూడా చక్కర్లు కొడుతుంది..


ఇక లాస్ట్ బట్ లాస్ట్ లీస్ట్ అంటూ చైతు హీరోయిన్ లిస్ట్ లో వినిపిస్తున్న మరో పేరు మెహ్రీన్. నాని హీరోగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయి మహాలక్ష్మి గా ఆకట్టుకున్న మెహ్రీన్ ఈ సినిమాలో చైతుకి హీరోయిన్ గా నటిస్తే వీరిద్దరి పెయిర్ అందరినీ ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తుంది.

ఇక చైతు సరసన రకుల్ రీసెంట్ గా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో హీరోయిన్ గా నటించడం, సమంత ప్రెజెంట్ రెండు బిగ్ ప్రాజెక్స్ట్ తో ఫుల్ బిజీ అయిపోవడంతో వీరిద్దరి పేర్లు చైతు హీరోయిన్ లిస్ట్ లో పెద్దగా వినిపించడం లేదు. మరి చైతు నటించనున్న ఈ పెస్టిజియస్ ప్రాజెక్ట్ లో నటించే ఆ హీరోయిన్ ఎవరో..తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.