చైతు డిసైడ్ అయిపోయాడు..

Sunday,July 09,2017 - 10:01 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రెజెంట్ తనకు సరైన క్యారెక్టర్స్ తో కొత్త స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘ప్రేమమ్’,’రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చైతు త్వరలోనే ‘యుద్ధం శరణం గచ్చామి’ అనే డిఫరెంట్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు చైతు.

‘యుద్ధం శరణం గచ్చామి’ సినిమా చేయడానికి తన మావయ్య వెంకటేష్ ఆదర్శం అని చెప్పిన చైతు కథల విషయంలో, డైరెక్టర్స్ ని నమ్మడం విషయంలో నాన్న నే ఫాలో అవుతానని చెప్పుకొచ్చాడు. ఇక నెక్స్ట్ సినిమాతో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నానని త్వరలోనే కోలీవుడ్ లో ఓ డిఫరెంట్ సినిమాతో పరిచయం అవ్వబోతున్నట్లు తెలిపాడు నాగ చైతన్య. ప్రెజెంట్ ‘యుద్ధం శరణం గచ్చామి’ సినిమాకు సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజి కి తీసుకొచ్చిన చైతు ఆగస్టు లో ఈ సినిమాతో థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు. సో నెక్స్ట్ సినిమాతో చైతు కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడన్నమాట