నాగచైతన్య కొత్త సినిమా 'సవ్యసాచి'

Wednesday,August 16,2017 - 11:06 by Z_CLU

త్వరలోనే చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. సవ్యసాచి అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తో లోగో కూడా రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ డిజైన్ తో తయారైన సవ్యసాచి టైటిల్ లోగో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

చందు మొండేటి-నాగచైతన్య కాంబినేషన్ లో ఇంతకుముందు ప్రేమమ్ సినిమా వచ్చింది. ఇది రెండో మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే ప్రారంభంకానుంది ఈ సినిమా. ప్రస్తుతం రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. గతంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించింది.

సవ్యసాచి మూవీకి సంబంధించి మిగతా వివరాల్ని సినిమా ఓపెనింగ్ రోజు వెల్లడిస్తారు. ఓ డిఫరెంట్ స్టోరీలైన్ తో ఈ సినిమా రానుంది.