మూడు సినిమాలతో చైతూ బిజీ

Sunday,June 23,2019 - 01:09 by Z_CLU

ప్రస్తుతం మావయ్య వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు షెడ్యుల్స్ ఫినిష్ చేసేసారు. ఈ సినిమా తర్వాత ఎవరూ ఊహించని కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు చైతు. ‘వెంకీ మామ’ షూటింగ్ పూర్తవ్వగానే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

శేఖర్ కమ్ముల తర్వాత డైరెక్టర్ శశితో దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేస్తాడు చైతు. ఈ సినిమా కూడా త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుంది. ఇలా వరుసగా మూడు సినిమాలు ఫైనల్ చేసుకొని ఒకటి తర్వాత మరొకటి సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. మజిలీ సూపర్ హిట్ కొట్టిన చైతూ ఈ మూడు సినిమాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటాడో..చూడాలి.