Naga Chaitanya - బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్!

Saturday,May 15,2021 - 04:42 by Z_CLU

టాలీవుడ్లో అక్కినేని కుటుంబానికి లవ్ స్టోరీస్ కి స్పెషలిస్ట్ అనే బిరుదు ఉంది. అక్కినేని నాగేశ్వర్రావు గారి నుండి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరకూ మూడు తరాలుగా ప్రేమకథలతో అలరిస్తున్నారు అక్కినేని వారు. అయితే తాత , తండ్రి నుండి లవర్ బాయ్ అనే ఇమేజ్ అందిపుచ్చుకున్న నాగ చైతన్య ఎక్కువ శాతం ప్రేమకథల మీదే దృష్టి పెడుతూ సినిమాలు చేస్తున్నాడు. అవును ఏమాయ చేశావే తో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న చైతూ ఎక్కువగా లవ్ స్టోరీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.

love story nagachaitanya sai pallavi

‘లవ్ స్టోరీ’లో చైతూ, సాయిపల్లవి

ఇక ఈ ఏడాది చైతూ నుండి రాబోయే రెండూ లవ్ స్టోరీసే. అందులో శేకర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘లవ్ స్టోరి’ కాగా మరొకటి విక్రం కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థాంక్యూ’. లవ్ స్టోరి సినిమాలో సాయి పల్లవితో రొమాన్స్ చేయనున్న చైతన్య థాంక్యూ ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు సీరియస్ లవ్ స్టోరీస్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. థాంక్యూ లో మాత్రం మూడు ఫేజెస్ లవ్ స్టోరీస్ ఉండబోతున్నాయి.

NagaChaitanya-VikramKumar Movie Launch

‘Thank You’ మూవీ ఓపెనింగ్

చైతూ ‘లవ్ స్టోరి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిదా లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడం , చైతూ -సాయి పల్లవి మొదటి సారి జోడి కట్టడంతో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్ . ఇక థాంక్యూ కి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకొని ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.ఈ రెండు ప్రేమకథలతో ఈ అక్కినేని యంగ్ హీరో ఎలాంటి హిట్స్ అందుకుంటాడో వేచి చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics