మరోసారి అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య

Tuesday,June 26,2018 - 11:28 by Z_CLU

మహానటి సినిమాలో ఏఎన్నార్ పాత్రలో కనిపించి మెప్పించాడు నాగచైతన్య. ఇప్పుడీ హీరో మరోసారి అదే పాత్రను పోషించబోతున్నాడు. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించాడు డైరక్టర్ క్రిష్. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి.

బాలకృష్ణ లీడ్ రోల్ లో రాబోతోంది ఎన్టీఆర్ బయోపిక్. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, ఏఎన్నార్ పాత్రలో చైతూ కనిపించనున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే నెల రెండో వారంలో ఈ బయోపిక్ సెట్స్ పైకి వస్తుంది. అప్పుడు ఈ పాత్రలపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

తేజ తప్పుకున్న తర్వాత క్రిష్ హ్యాండిల్ చేస్తున్నాడు ఈ బయోపిక్ ని. కథ, స్క్రీన్ ప్లేలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. క్రిష్ వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు ఈ సినిమాను రెండుగా విడగొట్టడమే. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలుగా రాబోతోంది. పార్ట్-1ను ఎన్నికల టైమ్ కు విడుదల చేయాలనేది ప్లాన్.