నా కెరీర్ లో బెస్ట్ ఓపినింగ్స్

Saturday,May 27,2017 - 08:18 by Z_CLU

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. తొలి రోజే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా సక్సెస్ మీట్ ఏర్పారు చేశారు యూనిట్.

ఈ సందర్బంగా నాగ చైతన్య మాట్లాడుతూ” నా కెరీర్ లోనే బెస్ట్ ఓపినింగ్స్ వచ్చాయని తెలియగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను..ఈ సినిమాను మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న అభిమానులకు అలాగే ప్రేక్షకులకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నా. నాన్న కి స్పెషల్ థాంక్స్ మొదటి నుంచి ఈ సినిమా విషయం నాన్న ఎంతో కేర్ తీసుకొని పూర్తిగా సంతృప్తి చెందే వరకూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఇక థియేటర్స్ లో బీచ్ సీన్ కి మిగతావాటికి క్లాప్స్ పడుతున్నాయంటే ఆ క్రెడిట్ కళ్యాణ్ కె దక్కుతుంది. ముఖ్యంగా నా కోసం శివ అనే ఇంత మంచి క్యారెక్టర్ రాసినందుకు చాలా థాంక్స్. ఇక జగపతి బాబు గారికి రకుల్ కి సంపత్ గారికి సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్ చెప్తున్నా.” అన్నాడు..