మారుతి డైరెక్షన్ లో నాగచైతన్య – నో వెడ్డింగ్ హాలిడేస్

Wednesday,August 30,2017 - 12:25 by Z_CLU

నాగచైతన్య యుద్ధం శరణం సెప్టెంబర్ 8 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న చైతు, తన నెక్స్ట్ సినిమా విషయంలోనూ అప్పుడే స్పీడ్ పెంచేశాడు. యుద్ధం శరణం తరవాత ఫ్యాన్స్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ అక్టోబర్ 6 న జరగబోయే సమంతా, చైతన్య పెళ్ళి పైనే ఉంది. పెళ్లి తరవాత ఈ లవ్ కపుల్స్ ఎన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నారు… ఆ తరావాత ప్లాన్స్ ఏమై ఉంటాయి..? అనే విషయాల్లో బోలెడన్ని స్పెక్యులేషన్స్ రేజ్ అవుతున్నాయి.

కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం, యుద్ధం శరణం తరవాత నాగచైతన్య ఇమ్మీడియట్ గా  మారుతి సినిమా సెట్స్ పైకి వచ్చే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్ళి తరవాత జస్ట్ 2 వీక్స్ బ్రేక్ తీసుకోనున్న నాగచైతన్య అక్టోబర్ 20 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఆలోచనలో ఉన్నాడు.

గతంలో మారుతితో ‘బాబు బంగారం’, నాగచైతన్య తో ‘ప్రేమమ్’ సినిమాని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.