ఆగస్ట్ 10న నాగ అన్వేష్ 'ఏంజిల్' ఓపెనింగ్

Tuesday,August 02,2016 - 04:58 by Z_CLU

 

 
టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్- ‘కుమారి 21’ ఫేమ్ హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఏంజిల్’. ఈ నెల 10న లాంఛనంగా ప్రారంభంకానుంది ఈ చిత్రం. పలుయంగ్ వురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ‘బాహుబలి’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన పళని ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో మెగాఫోన్ పడుతున్నాడు. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి ‘ఏంజిల్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ లో సాంగ్స్ రికార్డింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. విజయప్రకాశ్, శ్రేయాఘోషల్, నకాష్ అజీజ్ వంటి స్టార్ సింగర్స్ ‘ఏంజిల్’ చిత్రంలో పాటలు పాడటం విశేషం. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు.

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ – ఏంజిల్
తారాగణం

హీరో- నాగ అన్వేష్
హీరోయిన్- హేబా పటేల్
సప్తగిరి
సాంకేతిక వర్గం
బ్యానర్- శ్రీ సరస్వతి ఫిల్మ్స్
ప్రొడ్యూసర్- సింధూరపువ్వు కృష్ణారెడ్డి
డైరెక్టర్- ‘బాహుబలి’ పళని
సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో