నాగ్ కొత్త సినిమా అప్ డేట్స్

Sunday,December 18,2016 - 09:00 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో సీనియర్ల జోరు నడుస్తోంది. ఉన్నట్టుండి సీనియర్ హీరోలంతా డిసెంబర్ పై గురి పెట్టారు. ఏడాది చివరి నెల కావడం ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుండడంతో వరుసగా ఫాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్టులు అందిస్తున్నారు సీనియర్ హీరోలు.

    ఇప్పటికే మెగాస్టార్ లేటెస్ట్ సినిమా టీజర్ ఆ తరువాత వెంకటేష్ లేటెస్ట్ సినిమా ‘గురు’ టీజర్ తో పాటు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ హిస్టారికల్ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రయిలర్ కూడా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుండడంతో ఇక నా టీజర్ కూడా రెడీ అంటూ దూసుకొస్తున్నాడు కింగ్ నాగార్జున. ప్రెజెంట్ రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నటిస్తున్న నాగ్… ఆ సినిమా టీజర్ ఈ నెల 24 న రిలీజ్ చేయబోతున్నాడు. ఇలా ఈ ఏడాది చివర్లో సీనియర్ హీరోలు వాళ్ళ సినిమా టీజర్స్ తో ఫాన్స్ లో ఉత్సాహం నింపుతూ కొనసాగుతున్నారు..

ఓం నమో వేంకటేశాయ సినిమా ఆడియోను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను ఫిబ్రవరి 10న థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో నాగ్ ఉన్నాడు.