ఎవ్వరితోనైనా మల్టీస్టారర్ కి రెడీ

Friday,February 10,2017 - 11:25 by Z_CLU

టాలీవుడ్ లో ఒక ఇమేజ్ కి స్టిక్ అవ్వకుండా ఏ జోనర్ అయినా,డేర్ అండ్ డ్యాషింగ్ గా సెట్స్ పైకి తీసుకు వచ్చే  స్టార్ నాగ్. ఇప్పటికీ తన కరియర్ లో రొమాంటిక్, కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఏ జోనర్ టచ్ చేయకుండా లేడు నాగార్జున. ఒక్క హారర్ జోనర్ లో ఇప్పటి వరకు చేయలేదు, ఆ లోటు కాస్త రేపో మాపో సెట్స్ పైకి వచ్చే రాజు గారి గది 2  తో తీరిపోతుంది.

ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చేసిన ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగ్, స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా  ఉండాలి కానీ సినిమా ఏ జోనర్ అయినా నో చెప్పే ప్రసక్తి లేదని తేల్చేశాడు. సినిమా సక్సెస్ గ్యారంటీ అనిపిస్తే తన తోటి స్టార్స్ వెంకటేష్, బాలయ్య, చిరంజీవి లతో మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా రెడీ అని చెప్పాడు కింగ్.

samantha-nagarjuna-zee-cinemalu

నాగార్జున హాతీరాం బాబాగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఓం నమో వెంకటేశాయ ఈ రోజు నుండి థియేటర్స్ లో సందడి చేయడం బిగిన్ అయింది. ఈ ఫీవర్ కాస్త తగ్గుముఖం పడుతుందో లేదో రాజు గారి గది 2 సెట్స్ పై ఉంటాడు నాగ్. ఈ సినిమాలో సమంతా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తుంది.