రవితేజ, నాగార్జున మధ్య తప్పిన పోటీ..?

Thursday,October 05,2017 - 06:34 by Z_CLU

రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్, నాగార్జున చేస్తున్న రాజు గారి గది-2 సినిమాలు రెండూ 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకి రావాలి. రవితేజ సినిమా 12న, నాగ్ సినిమా 13న రిలీజ్ అవుతుందని మొన్నటివరకు అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. మేకర్స్ కూడా ఇవే తేదీల్ని దాదాపు ఫిక్స్ చేశారు. కాకపోతే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పింది. రిలీజ్ డేట్స్ మధ్య గ్యాప్ పెరిగింది.

నాగార్జున నటిస్తున్న రాజు గారి గది-2 సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సినిమా అదే తేదీకి వస్తోంది. కానీ రాజా ది గ్రేట్ మాత్రం 12న రావట్లేదట. రాజుగారి గది-2 విడుదలైన వారం తర్వాత అక్టోబర్ 19న రాజా ది గ్రేట్ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

అటు నాగార్జున, ఇటు రవితేజ ఇద్దరికీ ఇవి ప్రత్యేకమైన సినిమాలే. కెరీర్ లోనే ఫస్ట్ టైం రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తున్నాడు. ఇక నాగార్జున కూడా తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హారర్-కామెడీ జానర్ ను టచ్ చేస్తూ రాజు గారి గది-2 సినిమా చేశాడు. సో.. ఈ రెండు సినిమాలు వీళ్లిద్దరికీ కీలకమే.