సాంగ్ రికార్డింగ్ తో ప్రారంభమైన నాగ్-నాని సినిమా

Saturday,February 24,2018 - 06:02 by Z_CLU

నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పాటల రికార్డింగ్ తో ఈరోజు ప్రారంభమైంది. మహతి స్టుడియోలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, మణిశర్మ సంగీత సారధ్యంలో సాంగ్ రికార్డింగ్ స్టార్ట్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రీన్ ప్లే ను సిద్ధంచేశాడు శ్రీరామ్ ఆదిత్య. మార్చి నుంచి మూవీ సెట్స్ పైకి వస్తుంది. రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాగార్జున, ఓపెనింగ్ కు హాజరుకాలేకపోయాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగార్జునకు ఇది నాలుగో సినిమా.

సినిమాకు సంబంధించి హీరోయిన్ల వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. ఈ మూవీలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాధ్ ను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. మూవీ సెట్స్ పైకి వచ్చిన తర్వాత హీరోయిన్లపై ఓ క్లారిటీ వస్తుంది.