గర్ల్ ఫ్రెండ్స్ ని పరిచయం చేసిన దాస్ & దేవ

Monday,September 17,2018 - 03:23 by Z_CLU

సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానున్న ‘దేవదాస్’ తమ హీరోయిన్స్ ను ఆడియన్స్ కి పరిచయం చేస్తూ వాళ్ళ లుక్స్ తో పోస్టర్స్ రిలీజ్ చేసారు. నాగార్జున -నాని కాంబినేషన్లో శ్రీరాం ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ , నాని సరసన రశ్మిక హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..  సినిమాలో వారి క్యారెక్టర్ లుక్స్ తో కూడిన పోస్టర్స్ తో హీరోయిన్స్ ని పరిచయం చేసారు నాగార్జున , నాని.

“చాలా రోజుల తర్వాత నా పక్కన ఓ అందమైన అమ్మాయి… మళ్ళీ రోమాన్స్ చేయబోతున్నా” అంటూ దేవ తన జీవితంలోకి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ జాహ్నవి గురించి చెప్తూ ఆకాంక్ష సింగ్ పోస్టర్ ను రిలీజ్ చేయగా….

“ఫస్ట్ టైం మిమ్మలిని మెట్రో లో చూసినప్పుడే… లోపల ఏదో రింగ్ అయ్యింది పూజ గారు … మళ్ళీ ఎప్పుడు ?” అంటూ దాస్ తన గర్ల్ ఫ్రెండ్ పూజ(రష్మిక) కి జరిగిన ఓ సీన్ గురించి వివరిస్తూ రష్మిక పోస్టర్ ను రిలీజ్ చేసాడు. ఇలా ‘దేవదాస్’ సినిమాలో తమ హీరోయిన్స్ క్యారెక్టర్ పేర్లతో పోస్టర్స్ ను డిఫరెంట్ రిలీజ్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేసారు నాగ్ & నాని.