కొత్త నాగార్జున కనిపిస్తాడు...

Monday,November 28,2016 - 09:00 by Z_CLU

ఎట్టకేలకు కింగ్ నాగార్జున, రాజుగారి గదిలోకి ఎంటరయ్యాడు. మొన్నటివరకూ అసలు నాగ్ ఈ సినిమా లో నటిస్తాడా లేదా అనుకున్న అందరికీ షాక్ ఇచ్చాడు. సడెన్ గా రాజుగారి గది-2 సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఓ హారర్ కాన్సెప్ట్ సినిమాలో నాగ్ నటించడం కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం. హారర్ సినిమాలో నటించడమే ఫస్ట్ టైం అనుకుంటే… రాజుగారి గది లాంటి హారర్ సినిమా సీక్వెల్ లో నటించడం మరో విశేషం. నటుడు-దర్శకుడు ఓంకార్ ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తున్నాడు. గతంలో నాగార్జునతో ఊపిరి లాంటి డిఫరెంట్ మూవీని తీసిన పీవీపీ సంస్థ, ఈసారి కూడా కింగ్ తో అలాంటి ప్రయత్నమే స్టార్ట్ చేసింది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.

రాజుగారి గది-2 ను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన కింగ్ మాట్లాడుతూ ” మనం తో నా కెరీర్ ఓ కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా చేస్తున్నా. ఈ సినిమా తరువాత ఎలాంటి కథ చేస్తే బాగుంటుందా? అని ఎదురుచూస్తున్న టైమ్ లో ఓంకార్ ఈ కథ వినిపించాడు. నాకు కూడా కొత్తగా అనిపించింది. ఎప్పటి నుండో హారర్ థ్రిల్లర్ సినిమా చెయ్యాలని అనుకుంటున్నా. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమాతో ఇప్పటివరకూ చూడని కొత్త నాగార్జునని చూస్తారు అని తెలిపాడు నాగ్…