సెంటిమెంట్ గా మారిన అనుష్క

Saturday,August 06,2016 - 03:39 by Z_CLU

 

అక్కినేని నాగార్జున తాజాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న 4వ భక్తిరస చిత్రం కావడంతో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంతో మరోసారి నాగార్జునకు సెంటిమెంట్ గా మారబోతుంది హీరోయిన్ అనుష్క. ఇటీవలే ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో పాటు నాగ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఊపిరి’ లోనూ గెస్ట్ రోల్ లో కనిపించి విజయంలో భాగమైంది బొమ్మాళి. అందుకేనేమో ప్రస్తుతం నాగ్ నటిస్తున్న భక్తిరస చిత్రంలోకి కూడా అనుష్కను తీసుకున్నారు. ఈ చిత్రంలో అనుష్క క్రిష్ణమ్మ అనే భక్తురాలి పాత్రలో కనిపించనుంది. కృష్ణమ్మ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే నాగార్జున గెటప్ తో పాటు… వేంకటేశ్వరస్వామి గెటప్ ను కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్… తాజాగా అనుష్కకు సంబంధించిన కృష్ణమ్మ గెటప్ ను కూడా విడుదల చేసి… ప్రాజెక్టుపై అంచనాలు పెంచారు. విమలారామన్, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.