ఆ సీక్వెల్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేసాడు

Sunday,May 13,2018 - 11:12 by Z_CLU

ప్రస్తుతం మహానటి సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా అయిన నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సీక్వెల్ అంటూ వస్తున్న వార్తలను కొట్టిపడేసాడు. ఇటివలే ‘జీ సినిమాలు’ ఇంటర్వ్యూలో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సీక్వెల్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని..ఆ సినిమాకు సీక్వెల్ అన్నమాటలో నిజం లేదని. కానీ నానితో ఓ సినిమా చేసే ప్లాన్ అయితే ఉంది… కానీ అది ఎవడే కి సీక్వెల్ మాత్రం కాదని చెప్పుకొచ్చాడు.

ఇక ఇటివలే చిరంజీవి కూడా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలనుందని తన మనసులోని మాట బయపెట్టాడు. అయితే నాగ్  అశ్విన్ ఇప్పటికే ఓ స్క్రిప్ట్ రెడీ చేసాడని ఆ స్క్రిప్ట్ ను చిరు తో చేసే చాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. మరి ‘మహానటి’ నాగ్ అశ్విన్ నెక్స్ట్ సినిమాపై మెగాస్టార్ తోనే ఉంటుందా అనేది తెలియాలి.