నేను నా బెస్ట్ ఫ్రెండ్

Monday,January 09,2017 - 08:17 by Z_CLU

వేంక‌టేశ్వ‌ర స్వామిని నేను స్నేహితుడిగానే చూస్తాడట  కింగ్ నాగార్జున. ఇటీవలే రాఘవేంద్రరావు దర్శకత్వం లో మరో సారి ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నటించిన నాగార్జున లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో వేడుక లో వెంకటేశ్వర స్వామి తనకు అందించిన బహుమతుల గురించి చెప్పు కొచ్చాడు నాగ్. చిన్న‌ప్ప్పుడు తన అమ్మ‌తో తిరుమ‌ల‌కు వెళ్లే వాడినని ఆ త‌ర్వాత సినిమాలు విడుద‌లైన‌ప్పుడల్లా తిరుమ‌ల‌కు వెళ్లానని. అలా ఆయ‌న‌తో మంచి ప‌రిచయం ఏర్పడిందని. వేంక‌టేశ్వ‌ర స్వామిని నేను స్నేహితుడిగానే చూస్తుంటానని. అయితే ఓ సందర్భం లో ఆయ‌న్ను అమ్మ విష‌యంలో ఓ కోరిక కోరుకోవడం జరిగిందని అమ్మ‌కు ఆరోగ్యం బాగా లేక చివ‌రి ద‌శ‌కు చేరుకొని గతం మర్చిపోయినప్పుడు అమ్మ‌ను తీసుకెళ్లిపో స్వామి అని వేంక‌టేశ్వ‌రునికి అడిగానని. నేను ఫ్లైట్ దిగగానే అమ్మ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింద‌ని ఫోన్ వచ్చిందని అలాగే నాన్న‌గారి కోసం చేసిన ‘మ‌నం’ సినిమా హిట్ కావాలి స్వామి..నేను చేయాల్సిన ప్ర‌య‌త్నం అంతా చేస్తాన‌ని మొక్కుకోవడం జరిగింది అది కూడా నాకు ప్ర‌సాదించారని. అలాగే ఇద్ద‌రి అబ్బాయిల‌కు పెళ్ళి కూడా కుదిరింది. ఇలా తనకు ఎన్నో కోరికలను తీర్చరని అందుకు నా బెస్ట్ ఫ్రెండ్ వేంక‌టేశ్వ‌రునికి థాంక్స్“ అంటూ ఈ సందర్భం లో వెంకటేశ్వర స్వామి పై తన ఒపీనియన్ తెలిపాడు నాగ్.