'నభా నటేష్' ఇంటర్వ్యూ

Tuesday,July 16,2019 - 04:57 by Z_CLU

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నభా నటేష్ రెండు రోజుల్లో ఇస్మార్ట్ గర్ల్ గా ఎంటర్టైన్ చేయబోతుంది. నభా హీరోయిన్ గా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ జులై 18న రిలీజవుతున్న సందర్భంగా నభా మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు నభా మాటల్లోనే.!

పక్కా ఓల్డ్ సిటీ అమ్మాయిగా

సినిమాలో చాందిని అనే క్యారెక్టర్ చేసాను. పక్కా ఓల్డ్ సిటీ అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్రలో చాలా అల్లరి ఉంటుంది. కాలేజీలో కూడా అల్లరి చేసేదాన్ని. కొన్ని సార్లు మా నాన్నకు కూడా కంప్లైంట్ చేశారు.


హైపర్ గర్ల్

సినిమాలో హైపర్ గర్ల్ లా కనిపిస్తాను. నన్ను దోచుకుందువటే సినిమాలో కొంత హైపర్ గర్ల్ గా కనిపించినప్పటికీ ఈ సినిమాలో దానికి మించి ఉంటుంది. ఆ సినిమాలో బాబ్లీగా ఉంటాను. ఇందులో కంప్లీట్ హైపర్ గా కనిపిస్తూ మాస్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేస్తాను.

పూరి గారికే సాధ్యం

సినిమాలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. ట్రైలర్స్ లో కొన్నే ఉన్నాయి. సినిమాలో ఇంకా బోలేడుంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ కి అలాంటి డైలాగ్స్ రాయడం, చెప్పించడం పూరి గారికే సాధ్యం.

నేర్చుకున్నాను

సినిమా సైన్ చేయక ముందు నాకు ఇన్ని డైలాగ్స్ ఉంటాయని తెలియదు. సైన్ చేసిన తర్వాత నా సీన్స్, డైలాగ్స్ పేపర్స్ ఇచ్చారు. అప్పటి నుండే తెలంగాణ నేర్చుకున్నాను. డబ్బింగ్‌ మాత్రం నేను చెప్పలేదు.

ఒక్క సన్నివేశం కూడా లేదు

రామ్‌తో కలిసి నాలుగు పాటల్లో నటించా. ఓ పాటలో నేను, నిధి, రామ్‌ నటించాం. దీన్ని మినహా ఇస్తే.. నాకు, నిధికి మధ్య ఒక్క సన్నివేశం కూడా లేదు. రామ్‌కు, నాకు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.


చాలా సలహాలిచ్చారు

మొదట్లో ఈ క్యారెక్టర్ చేయడం కష్టమనిపించింది. షూటింగ్‌ సమయంలో పూరీ గారు చాలా సలహాలిచ్చారు. అందుకే నా పని సులభంగా అనిపించింది. రామ్‌ కూడా హెల్ప్ చేశారు. అలాగే డైరెక్షన్ టీం కూడా డైలాగ్స్ చెప్పడానికి సహాయం చేసారు.

సినిమాలో మూడు సార్లు

ట్రైలర్‌లో రామ్‌ను కొట్టిన సన్నివేశం ఉంటుంది. ఇలాగే సినిమాలో మొత్తం మూడు సీన్లలో ఆయన్ను కొడతా. మొదట రామ్‌ను కొట్టాలంటే భయపడ్డా. పూరీ, రామ్‌ కొట్టు ఫర్వాలేదన్నారు. అప్పుడే సీన్‌ బాగా వస్తుందని చెప్పారు.

నెక్స్ట్ రవితేజతో…

ప్రస్తుతం రవితేజతో ‘డిస్కోరాజా’లో నటిస్తున్నా. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’ అని చెప్పారు.