'నాంది'కి అదొక్కటే బ్యాలెన్స్

Thursday,July 02,2020 - 10:15 by Z_CLU

అల్లరి నరేష్ హీరోగా క్రైం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ‘నాంది’ మొన్నటివరకు చకచకా షూటింగ్ జరుపుకుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఫైనల్ షెడ్యుల్ మినహా టోటల్ షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా కనిపించడం లేదు. అవును… కొన్ని చిన్న సినిమాలు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలతో షూటింగ్ మొదలయ్యాయి. కానీ ‘నాంది’ షూట్ కి మాత్రం ఇంకా సమయం పడుతుంది.

దానికి కారణం ఈ సినిమా ఫైనల్ షెడ్యుల్ దాదాపు 150 జూనియర్ ఆర్టిస్టులతో షూట్ చేయాల్సి ఉంది. అలాగే అవుట్ డోర్ లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మందితో నిబంధనల మేరకు అవుట్ డోర్ లో షూట్ చేయడం కుదరదు కనుక పరిస్థితులు చక్కబడే వరకు ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే మిగిలిన బ్యాలెన్స్ షూట్ చేసి ఓ మంచి డేట్ కి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. వేగేశ్న సతీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.