నా పేరు సూర్య ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,May 07,2018 - 12:22 by Z_CLU

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ చేసిన నా పేరు సూర్య మూవీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ఈ సినిమాకు ఏకంగా 85 కోట్ల 32 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ట్రేడ్ ఎనాలిసిస్ ప్రకారం మరో 2 రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కు చేరుకుంటుందని అంచనా.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్

నైజాం – రూ. 8.84 కోట్లు
సీడెడ్ – రూ. 4.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.52 కోట్లు
ఈస్ట్ – రూ. 2.76 కోట్లు
వెస్ట్ – రూ. 2.05 కోట్లు
గుంటూరు – రూ. 3.26 కోట్లు
కృష్ణా – రూ. 1.88 కోట్లు
నెల్లూరు – రూ. 1.05 కోట్లు